న్యూఢిల్లీ ఫిబ్రవరి 8:- కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు మహారత్న ప్రతిపత్తి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, దానికోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వరంగ సంస్థల శాఖ చేసిన ప్రకటనపై ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు.
ఆయా ప్రభుత్వరంగ సంస్థలు నిర్వహిస్తున్న శాఖలు తమ ప్రకటనపై ఇంకా స్పందించలేదని, ప్రభుత్వరంగ సంస్థల శాఖ కార్యదర్శి భాస్కర్ చటర్జి సోమవారం నాడు పత్రికల వారికి చెప్పారు. ఈ వారంలో కొన్ని దరఖాస్తులు రావచ్చునని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
లాభసాటిగా దీర్ఘకాలం నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలకు నిర్ణయాధికారాన్ని పెంచాలని డిసెంబరు నెలలో కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించింది.కొత్తగా మహారత్న ఇచ్చే కంపెనీల వ్యవహారాలను దరఖాస్తులను పరిశీలించడానికి ప్రభుత్వరంగ పరిశ్రమల శాఖ స్క్రీనింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
ఓఎన్‌జిసి, ఇండియన్ ఆయిల్, సెయిల్, ఎన్‌టి పిసి వంటి ప్రభుత్వరంగ సంస్థలకు మహారత్న ప్రతిపత్తి సంపాదించగల స్థాయి ఉంది. మూడు సంవత్సరాల పాటు ఐదువేలకు మించి వార్షిక నికరలాభం 15వేల కోట్ల నెట్‌వర్త్, 25వేల టర్నోవర్ కంపెనీలు ఇందుకు అర్హత సంపాదిస్తాయి.