మార్చిన వార్తా విశేషాలు - గురు వారం మార్చి   18th 2010 - 1:02 PM RSS  

Bharatmatrimony
లాగిన్ | రిజిస్టర్
సర్‌ ఐజాక్‌ న్యూటన్‌ బాల్యం!
మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 11:49 [IST]
ఎ. రాజ్యశ్రీ

nutonగురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొన్న సర్‌ ఐజాక్‌ న్యూటన్‌ బాల్యం అంతా బాధామయం. 25 డిసెంబర్‌ 1642 లో ఇంగ్లాండ్‌లోని వల్స్‌ధ్రాప్‌ అనే గ్రామంలో పుట్టాడు. పాపం న్యూటన్‌ పుట్టకముందే తండ్రి చనిపోయాడు. ఇతనికి రెండేళ్లు ఉన్నప్పుడు తల్లి ఒక ఫాదర్‌ని పెళ్లాడింది. నాయనమ్మ ఈ పిల్లాడి ఆలనా పాలనా చూసేది. ఏడాదికోసారి  సవతి తండ్రి కొంచెం డబ్బు ఇచ్చేవాడు. ఎవరితో కలవకుండా ఒంటరిగా ఇంటి బయట మట్టిలో ఆడేవాడు.

తమ గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్లో చేరాడు. మామూలు స్కూలు చదువ్ఞ కన్నా ఇతర సైన్సు పుస్తకాలు చదవటం, పెద్ద వస్తువ్ఞల్ని చూసి అవే చిన్న సైజులో తయారు చేయటం ఇలాంటి పనులు చేస్తుండే వాడు. పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చేవి కావ్ఞ. బాగా కష్టపడి  క్లాసు ఫస్టు వచ్చేవాడు. చిన్న చిన్న మిషన్లు, నీటి గడియారం, ఎండలో పనిచేసే గడియారం కూడా తయారు చేశాడు. అవి ఇప్పటికీ లండన్‌ రాయల్‌ సొసైటీ మ్యూజియంలో ఉన్నాయి.

 18వ ఏట ట్రినిటీ కాలేజ్‌లో చేరా డు. బాగా డబ్బున్న కుర్రాళ్లు చదివే కాలేజీలో న్యూటన్‌ ఒక్కడే బీదపిల్లా డు. అందుకే ఫీజు కట్టడం కోసం ఒక ప్రొఫెసర్‌ ఇంట్లో (అదే కాలేజీ ఆయ న) పని చేసేవాడు.4 సంవత్సరాల కాలేజీ చదువ్ఞ ముగించి బి.ఎ. పట్టా పొందాడు.సరిగ్గా అప్పుడే ఇంగ్లాండ్‌ లో ప్లేగు వ్యాధి ప్రబలటంతో అంతా ఇళ్లు విడిచి పారిపోసాగారు.

 కేంబ్రిడ్జి యూనివర్సిటీ కూడా దాదాపు రెండేళ్లు మూతపడింది. అందుకే ఇష్టం లేకపోయినా తల్లి దగ్గ రకెళ్లాడు. తన 26వ ఏట కేంబ్రిడ్జి అధ్యాపకునిగా చేరాడు. ప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త ఎడ్మండ్‌ హేలీతో పరిచ యం ఏర్పడింది. అతని ప్రోత్సాహం తో న్యూటన్‌ లాటిన్‌ భాషలో 'ప్రిన్సిపియాఅనే పుస్తకాన్ని రాశాడు. సూర్య,చంద్రుల ఆకర్షణ వలననే సముద్రంలో ఆటుపోట్లు వస్తాయని తేల్చాడు. ఆనాడు ఇంగ్లాండ్‌ ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతినటంతో రాజు విలియం, న్యూటన్‌ని కరెన్సీ ముద్రిం చే టంకసాల వార్టెన్‌గా నియ మించా డు. అతని నిజాయితీ వలన దొంగ నాణాలు అరికట్టబడ్డాయి. 20 మార్చి 1727లో85వ ఏట కన్ను మూశాడు.
 
 User Comments
[ Post Comments ]  
Be the first to comment this Article.
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 సరదానందించే సందేశాత్మక కథలు
 పుస్తకం ఒక మంచి నేస్తం
 అబ్బురపరిచే అందాల లోయలు
 వింత కోరిక
 కోడిపుంజు గర్వం
 పడగ ముడిచిన పన్నగం
 చేతుల చేతల గురించి
 కలిసొచ్చిన కాలం
 అంతరాత్మ
 రాజ్యం మారాలి
 
 
ముఖ్య వార్తలు
  నేటి నుంచి న్యూఢిల్లీకి దురంతో రైలు
  శాఖమూరికి నివాళి
  బహిష్కరణపై ఆగ్రహం
  డీమ్డ్‌ ఇక ఉండవ్ఞ
  హాకీ ప్రపంచ కప్‌ విజేత ఆస్ట్రేలియా
  ఆల్‌ ఇంగ్లండ్‌ బాడ్మింటన్‌..
  కామన్వెల్త్‌ బాక్సింగ్‌ సెమీస్‌లో..
  ముంబయి ఇండియన్స్‌ విక్టరీ
  జిల్లాల్లో ఆయుర్వేదంపై ప్రచారం
  లార్స్‌కో కొత్త చిత్రం
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com