మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
గట్టెక్కిన గండం
మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 11:51 [IST]
నరిశేపల్లి లక్ష్మినారాయణ, గుంతకల్లు

moggaకుందేలు పిల్ల కుయిలీది ఒకటే ఏడుపు. ముక్కు కుడి రంధ్రంలో ఇరుక్కున్న సీతాఫలం గింజ దాని రోదనకు కారణమైంది. తన కుయిలీ బాధ చూడలేక కుందేలు కుదూలైంది. ''ఏడవకు ఊరుకో అంటూ ఓదార్చసాగింది. గింజను బయటికి తీయాలనుకున్న భల్లూకానికి అది చిక్కలేదు. చింతతో తలపట్టుకుంది. గింజను పెరకటానికి పెనుగులాడిన పందికీ చుక్కెదురైంది.

''అసలు గింజ దొరికితేగా పీకటానికి అనుకొని ఊరుకుంది. కోతి కూడ విత్తనాన్ని ఊడబెరకాలని పలువిధాల ప్రయత్నించింది కానీ కుయిలీ కారుస్తున్న కన్నీటి ధారకు కలవరపడి ఒకవేళ ముక్కుకేమైనా జరిగితే అంతా తనను ఆడిపోసుకుంటారని వెనక్కు తగ్గింది. ''కుందేలక్కా, కుయిలీకి నీవ్ఞ ఆ ఫలాన్ని ఇవ్వకుంటే బాగుండేది అంది.

 ''ఇలా జరుగుతుందని నాకు మాత్రం తెలుసా? ఆకలేస్తోందంటే ఆ పండు ఇచ్చాను, లేచిన వేళ బాగాలేదనిపిస్తోంది అంది కుందేలు. ''పండు ఇచ్చావ్ఞ సరే, విత్తనం ముక్కు కలుగులో ఎలా చిక్కుకుంది? అడిగింది ఎలుగు. కుందేలు ''కుయిలీ ఫలాన్ని తినటం మొదలుపెట్టిందో లేదో దగ్గు రావటంతో నోట్లోని గింజ ముక్కులో దూరింది, ఇదివరలో గాలి వానకు చెట్టుకూలి, తొర్ర చీలితే ఈ చిట్టడవిలోని చిట్ట చివరి గుట్ట చేరాను, అక్కడ అప్పుడప్పుడు పులి గాండ్రింపులు విని కుయిలీ జడుసుకోటంతో ఆ గుట్ట వదిలి ఈ పొదల మధ్యకొచ్చాను, కూడబలుక్కోని వచ్చినట్టు ఈ కష్టాలన్నీ నాకే రావాలా? అని కంటతడి పెట్టింది.

అప్పుడే అక్కడికొచ్చి అంతా విన్న అడవిదున్న ''నీ కుయిలీకి ధైర్యం చెప్పి ఆగింజ బయటికొచ్చే మార్గం చూడాలి కానీ నీవే కన్నీరు మున్నీరుగా ఏడిస్తే కుయిలీ బెంబేలెత్తి మరింత దుఃఖించదూ అంటూ వెళ్ళిపోయింది. కుయిలీ ముక్కును నేలకేసి రాసి బిగ్గరగా ఏడ్వసాగింది. కుంట వద్దనుండి నెమ్మదిగా నడిచి వచ్చిన తాబేలు విషయం విని ఆశ్చర్యపోయింది.

 ''ఎక్కడా ఇలాంటిది జరిగినట్టు ఎప్పుడూ వినలేదు, ఇటువైపు రాక చాలా రోజులైంది కదా ఒకమారు పలకరించి వెళదామని వచ్చాను, అయితే ఈ దుస్సంఘటనను చూడాల్సొస్తుందని అనుకోలేదు, ఏదీ ఆ గింజను వీలైతే బయటికి తీస్తాను అని కుయిలీ ముక్కును నోటితో తాకబోయింది, కానీ కుయిలీ కెవ్ఞ్వమనటంతో తాబేలు తత్తరపాటుతో తనకెందుకా తపన అని తప్పుకొంది. కొంతసేపటికి జిరాఫీ అటుగా వచ్చింది.

 జరిగింది ''అదా సంగతి, దాని కాళ్ళను పైకెత్తి తలను కిందికి వేలాడతీస్తే సరి, వద్దన్నా ఆగింజ బయటపడుతుంది అంది. ''అదేదో బాగానే ఉంది, అలా చేద్దాం అని ఎలుగు కుయిలీ కాళ్ళు పైకెత్తి తలను కిందికి చేసి పట్టుకుంది, కానీ ప్రయోజనం లేకపోయింది. జిరాఫీ వెళ్ళిపోయింది. కుయిలీని ముప్పు నుండి తప్పించే విషయమై ప్రాణులన్నీ మల్లగుల్లాలు పడ్డాయి. ఈలోగా ఉడుత బుడబుడమని అక్కడికి వచ్చింది. ''నేను ఆహారానికి వెళ్ళేటప్పుడు కుయిలీ కుప్పిగంతులేస్తూ కనిపించింది, కుంటలో నీరు తాగి వచ్చేటప్పుడు ఎదురైన తాబేలు నాకు ఈ తతంగం తెలిపితే తొందరగా వచ్చాను అంది.

''అవ్ఞను, నీవ్ఞ వెళుతూ చూసినపుడు ఉల్లాసంగా ఉంది, సీతాఫలం తినటంతో దానికీ దుర్గతి పట్టింది దీనంగా అంది కుందేలు. ''అప్పుడేమైందని ఆ వేదన. కీలెరిగి వాత పెట్టాలన్నట్టు, కుయిలీ కష్టం తొలగటానికి నాకో చిట్టి చిట్కా తెలుసు అంది. వెంటనే వెళ్ళి తన తొర్రలో దూరి దాచుకున్న ఒక నెమలి పింఛాన్ని తెచ్చింది. దాని కొసను ముక్కు ఎడమ రంధ్రంలో దూర్చి గెలికింది. కుయిలీ ''హాచ్‌ అని తుమ్మింది. మరుక్షణమే ముక్కులో నుండి కుయిలీ ఊపిరి పీల్చుకుంది. దాని ముఖంలో విషాద ఛాయలు తొలగి దరహాస రేఖలు పొడసూపాయి. కుందేలు ఆనందంతో ఉడుతను చూసి ''నీవ్ఞ కుయిలీని గండం నుండి గట్టెక్కించావ్ఞ, నీ ఉపకారం ఎన్నటికీ మరువను అంది. జంతువ్ఞలన్నీ ఉడుతను పొగడ్తలలో ముంచి తన దారిన తాము వెళ్ళిపోయాయి
 
 User Comments
[ Post Comments ]  
Be the first to comment this Article.
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 పలురకాల పత్రాలు
 రేచీకటిఅటకమీది గండుపిల్లి
 అబద్ధాల నక్క
 మానవసేవే మాధవసేవ
 ప్రేరణనిచ్చే విజ్ఞానమూర్తులు
 ఉచిత సలహాలు
 ఆప్తవాక్యం
 పొడుపు పద్యాలు
 నీడనిచ్చే నిండైన ఇల్లు
 Mogga
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com