షారూక్‌ఖాన్, కాజోల్ జోడి అనగానే భారతీయ సినీ ప్రేమికులందరికీ వెండితెరపై కన్నుల పండువగా వ్ఞంటుంది. సిల్వర్ స్క్రీన్‌పై మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా అద్భుతమై అభినయాన్ని ప్రదర్శించి ఈ జంట ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంది.
'దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే 'కుచ్ కుచ్ హోతాహై చిత్రాలు ఎంతటి ప్రేక్షకాదరణ పొందాయో తెలిసిందే. తాజాగా వీరిద్దరూ జంటగా కరణ్ జోహార్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 'మై నేమ్ ఈజ్ ఖాన్. కాజల్‌తో చాలా కాలం తర్వాత నటిస్తున్నందుకు షారూక్‌ఖాన్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ 'కాజల్ ఈ చిత్రానికి ప్రధానాకర్షణ అవ్ఞతుంది.
వాస్తవానికి 'దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే 'కుచ్ కుచ్ హోతా హై చిత్రాల్ని కాజల్‌ను దృష్టిలో పెట్టుకుని కరణ్‌జోహార్ కథాంశాల్ని తయారుచేసుకున్నాడు. అయితే ఆ చిత్రాలు మా ఇద్దరికీ మంచి స్టార్‌డమ్‌ని తెచ్చిపెట్టాయి.
'మై నేమ్ ఈజ్ ఖాన్ చిత్ర కథాంశాన్ని నా కోసం తయారుచేశాడు. అయినా కాజోల్ ఈ చిత్రంలో నటిస్తుండటంతో సినిమాకి ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్‌ని తెచ్చిపెట్టింది అన్నారు. ఈ చిత్రం ఈ వారం ప్రేక్షకుల ముందుకురానుంది.