పంజగుట్ట (హైదరాబాద్) ఫిబ్రవరి 8 ప్రభాతవార్త: ప్రస్తుత రోశయ్య పరిపాలనలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని మాజీమంత్రితలసాని శ్రీని వాస్‌యాదవ్ అన్నారు. సోమవారం సోమా జిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా రోశయ్య ప్రమాణస్వీకారం చేసిన రోజునుంచి రాష్ట్రంలో అనేక విషాదకర సంఘటనలు చోటు చేసుకోవడం బాధకరమన్నారు. ప్రభుత్వ పరి పాలన విధానంలో కూడా లోపం కనిపిస్తుందని అధికారులు, మంత్రులు ముఖ్యమంత్రి మాట ఖాతరు చేయడం లేదని తలసాని పేర్కొన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ పరిపాలనా హయాంలో పనిచేసిన అధికారులే ఇప్పటికీ అవే స్థానంలో కొనసాగుతుండడంతో పరిపాలన పరమైన ఇబ్బం దులు కలుగుతున్నాయన్నారు.
రోశయ్య సిఎం అయిన తరువాత కర్నూలు వరదలు, విజయవాడ వైష్ణవిహత్య, హైదరాబాద్‌పార్క్ ఆసుపత్రి నారాయ ణగూడ ఘటనలు వరుసగా విషాదకరసంఘటనలే జరుగుతున్నాయని అయితేమంత్రులు, అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న దాఖలాలు లేవని ఆయన పేర్కొన్నారు.రోశయ్య వయస్సును గౌర విస్తున్నాను కానీ ఆయన పరిపాలనా విధానాన్ని గౌరవించలేకపోతున్నానని తలసాని అన్నారు.