మనీలా, ఫిబ్రవరి 8: ఫిలిప్పీన్స్ రాజధానికి ఆగ్నేయంగా ఉన్న ప్రాంతంలో సోమవారం పోలీస్‌చెక్‌పోస్టును ధ్వంసంచేయడానికి యత్నించిన ఎనిమిదిమంది సాయుధులను పోలీసులు కాల్చివేసినట్లు అధికారులు తెలిపారు.
వ్యానులో వచ్చిన సాయుధులు పోలీసులు చెప్పినా వినకుండా చెక్‌పోస్టును తమ వాహనంతో ఢీకొన్నారు. దాంతో చెక్‌పోస్టు వద్ద ఉన్న పోలీసులు కాల్పులు జరిపారు. మనీలాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాండలెరియానగరంలో ఈ సంఘటన జరిగినట్లు ప్రొవిన్షియల్ పోలీస్ ఉన్నతాధికారి ఎల్మో సరోనా తెలిపారు.
సాయుధుల వ్యాన్ నుంచి ఎనిమిది తుపాకులు,గ్రెనేడ్ స్వాధీనంచేసుకొన్నట్లుఆయన చెప్పారు. సాయుధులు కూడా పోలీసులపై కాల్పులు జరిపారు. కానీ పోలీసులెవరూ గాయపడలేదు.సాయుధులు దొంగల ముఠాకు చెందినవారా కాదా అనే అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఫిలిప్పీన్స్‌జనాభా 9కోట్ల 30 లక్షలు కాగా వారిలో పదిలక్షలకంటే ఎక్కువమంది వద్ద లైసెన్స్‌లేని తుపాకులున్నాయి. ఆదేశంలో వీథిపోరాటాలు సర్వసాధారణం. పోలీసులకుజీతాలుతక్కువ. దాంతో వారు లంచాలకు అలవాటు పడ్డారు.వారికి ఇచ్చే శిక్షణ అంతంత మాత్రమే.