హైదరాబాద్, ఫిబ్రవరి 8, ప్రభాతవార్త : యూనివర్సి టీలపనితీరును మెరుగుపర్చకపోతే తీసుకోబోయే చర్యలకుబాధ్యులవుతారని రాష్ట్రగవర్నర్, యూని వర్సిటీల ఛాన్స్‌లర్ ఇ.ఎస్.ఐ.నరసింహన్ విసి లను హెచ్చరించారు. తనకు లౌక్యంగా మాట్లాడటం రాదని, ఉన్న విషయాన్ని స్పష్టంగా నేరుగా చెబు తాను.పనిచేయకుండానే ఉచితభోజనం దొరకద న్నారు.యూనివర్సిటీల పనితీరు మెరుగపర్చి, ప్రమా ణాలను పెంచాలని, ప్రకటించిన సమయానికి పరీ క్షలు నిర్వహించాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం తగ దని హితవు పలికారు.
రాష్ట్ర గవర్నర్‌గా నియమి తులైన తర్వాత మొదటి సారిగా యూనివర్సిటీల ఛాన్స్‌లర్‌హోదాలో సోమవారంనాడు జూబ్లి హాలులో జరిగిన వైస్‌ఛాన్స్‌లర్ల సమావేశంలో ఆయన యూని వర్సిటీల పనితీరుపై సీరియన్‌గా మాట్లాడారు. విసిలు బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు. యూనివర్సిటీలు కేవలం డిగ్రీలను ఇచ్చే కర్మాగారా లుగా కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దే సంస్థలుగా మారాలన్నారు. యూనివర్సిటీల్లో అడ్మిషన్ దరఖాస్తు తేదీల దగ్గరి నుంచి పరీక్షల ఫలితాల వరకు ఎప్పుడు ఏమి చేసేది క్యాలండర్ ప్రక టించి దాని ప్రకారం అన్నీ సవ్యంగా జరగాలని లేకుంటే విద్యార్థులు నష్టపోతారని పేర్కొ న్నారు.
ఉమ్మడి క్యాలెండర్‌ను సిద్ధం చేసి ఆప్రకారం తప్పని సరిగా పరీక్షలు సమయానికి నిర్వహించి ఫలి తాలను చెప్పిన తేదీల్లో విడుదల చేయాలని లేకుంటే విద్యా ర్థులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ఆశతో విద్యార్థులను వర్సి టీల్లో చేర్పిస్తారని, వారికి మంచి కౌన్సెలింగ్ ఇచ్చి వారిని సంపూర్ణ విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో విసిలు కీలకపాత్ర పోషించాలన్నారు. విసిలు వస్తారు, పోతారు,అయితే విద్యార్థుల భవిష్యత్తు విష యంలో విసిలు తగినజాగ్రత్తలు తీసుకోకపోతే విద్యా ర్థులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. అంకెలు చూపిస్తే సరిపోదు.. వైస్‌ఛాన్స్‌్‌లర్లు తమ యూనివర్సిటీల పనితీరు మెరు గుకు తీసుకున్న చర్యల గురించి ప్రతి మూడు నెలల కోసారి నివేదికను ప్రభుత్వానికి పంపాలని, దానిని తాను కూడా పరిశీలించి వర్సిటీల పనితీరు మెరు గుకు చర్యలు తీసుకుంటామన్నారు. నేను, మీరు కాదు అందరం అనే భావనతో ఉమ్మడిగా కలిసి ఉన్నత విద్య అభివృద్ధికి కృషి చేద్దామన్నారు. వర్సి టీలు కేవలం అంకెలు చూపిస్తే సరిపోదని, ఆచ రణలో పెట్టిన కార్యక్ర మాలను వివరించాలన్నారు. యుజిసి నిబంధనలు సరిగా అమలు చేస్తున్నారా? లేదా అన్న విషయాలను పరిశీలించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను విద్యలో అగ్రభాగాన నిలిపేందుకు విసిలు తమ వంతు కృషి చేయాలన్నారు. యూని వర్సిటీలకు స్వయంప్రతి పత్తి ఉండాలి కాదనను,కాని జవాబు దారి తనం లేకుండా స్వయం ప్రతిపత్తి ఉండటం అర్ధరహిత మన్నారు.
ఆర్థిక ప్రణాళిక ముఖ్యం ప్రతి యూనివర్సిటీ పక్కాగా ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవాలని నరసింహన్ పిలుపు ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఉన్నప్పటికీ వాటిని సంవ త్సరం మొదట ఖర్చు చేయకుండా చివరన హడావు డిగా ఖర్చు చేయడం మంచిది కాదని, దీనివల్ల నిధులు మురిగిపోతున్నాయన్నారు.ఇందువల్ల యూని వర్సిటీలు పక్కాగా ఆర్థిక ప్రణాళికను రూపొందించు కోవాలన్నారు. తాను యూనివర్సిటీల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, విసిలు ఎక్కడా కూడా నిర్లక్ష్యం కానరా కూడదని విసిలను హెచ్చరించారు. వర్సిటీల పనితీరును మెరుగుపర్చడంలో కీలకపాత్ర పోషించాలని, ఎవరికీ భయపడకుండా,మద్దతు ఇవ్వ కుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యపై ప్రత్యేక దృష్టి సారించి ఆ దిశగా కృషి చేస్తోందని ఉన్నత విద్యా శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు తెలిపారు. గత ఐదేళ్లలో 18 కొత్త యూనివర్సిటీలను, 73 డిగ్రీ కాలేజీలను, 93 జూనియర్ కాలేజీలను ప్రారంభించామన్నారు. విద్యాప్రమాణాలతోపాటు యూనివర్సిటీల జవాబు దారితనం పెరగాల్సిన అవసరం ఉందని, మొబైల్ టీచర్స్ వ్యవస్థ పోవాల్సి ఉందని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొ.కెసిరెడ్డి పేర్కొన్నారు. ఉన్నత విద్య ముఖ్యకార్యదర్శి బిశ్వాల్ మాట్లాడుతూ ఉన్నత విద్యలో మరింత మంచి ఫలితాలురావడానికి ఈ సమావేశం ఉపయోగపడుతుందన్నారు.