మార్చిన వార్తా విశేషాలు - భుధ వారం మార్చి   17th 2010 - 7:47 PM RSS  

Bharatmatrimony
లాగిన్ | రిజిస్టర్
బంగ్లాను చిత్తు చేసిన న్యూజిలాండ్‌
మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 10:50 [IST]

tylorడునేదిన్‌, ఫిబ్రవరి 8 : సోమవారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్‌ ఘోర పరాజయం పాలయింది. టాస్‌ గెలిచి బంగ్లాదేశ్‌కు బ్యాటింగ్‌ అప్పగించిన న్యూజిలాండ్‌ ప్రత్యర్థిని కట్టడి చేయడంలో పూర్తిగా పైచేయి సాధిం చింది. బంగ్లా టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ తమిమ్‌ ఇక్బాల్‌ (1), ఇమ్రుల్‌ క యాస్‌ (9), అశ్రఫుల్‌ (1), అహ్మద్‌ (10), షకిబ్‌ అల్‌ హసన్‌ (0)లను క్రీజ్‌లో నిలువ కుండా వరుసబెట్టి పెవీలియన్‌కు చేర్చిన కివీస్‌ బౌలర్లు 183 పరుగులకే బంగ్లా దేశ్‌ను కట్టడి చేశారు.

రహీమ్‌ ఒక్కడే జట్టును ఆదుకొని స్కోరుబోర్డును ముందు కు నడుపుతుండగా మిగతా బ్యాట్స్‌మెన్‌ మహ్మదుల్లా, షహదత్‌ హుసేన్‌, ఇస్లాం ఇలా అందరూ పెవీలియన్‌కు క్యూకట్టారు. అయితే మిడిలార్డర్‌లో ము ఫ్షికర్‌ రహీమ్‌ (86; 107 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో)కు నయీ మ్‌ ఇస్లాం 43 జత కలిసి కొంతమేరా రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 183 పరుగులు చేసింది.

న్యూజిలాండ్‌ బౌలర్లు బుట్లర్‌ 3 వికెట్లు తీసుకోగా, మెక్‌కా§్‌ు 2, టుఫ్పీ 1 వికె ట్‌ను పడగొట్టారు. తక్కువ టార్గెట్‌ను ఛేదించడానికి బరిలోకి దిగిన న్యూజిలాం డ్‌ ప్రారంభంలో తడబడి ఓపనర్‌ మెక్‌ కలమ్‌ వికెట్‌ను కోల్పోయింది. తర్వాత కోలుకుని టేలర్‌ (78), గుప్తిల్‌ (32), ఇగ్రామ్‌ (28)లు జట్టు విజయానికి బాట లు వేయగా వెటోరి (4 నాటౌట్‌), ఫ్రాంక్లిన్‌ (20 నాటౌట్‌)లు మిగిలిన పనిని పూర్తి చేసి కేవలం 27.3 ఓవర్లలో 185 పరుగులు చేసి జట్టుకు 5 వికెట్ల విజయాన్నందించారు.

ఇస్లాం 3-49, రుబెల్‌ హుసేన్‌లు 2-68 బం తితో రాణించినప్పటికీ ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యం లేకపోవడంతో జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయారు. 78 పరుగులు చేసి న్యూజిలాండ్‌ విజ యంలో కీలక పాత్ర వహించిన రాస్‌టేలర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

సంక్షిప్త స్కోర్లు : బంగ్లాదేశ్‌ : (50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) 183. న్యూజి లాండ్‌ : (27.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి) 185.
 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 ఐపిఎల్‌లో ధోనీ సేన భోణీ
 ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను..
 జంట విజయాలతో పెరిగిన నమ్మకం సౌరవ్‌..
 మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్‌
 నేటి నుంచి మార్గోవా బాడ్మింటన్‌..
 నకిలీ ఐపిఎల్‌ టిక్కెట్లతో..
 .సచిన్‌, గంభీర్‌, సంగక్కరలకూ తప్పని..
 ముంబయి ఇండియన్స్‌ విక్టరీ
 దక్షిణాఫ్రికాను ఓడించి 9వ స్థానంలో..
 సెంటిమెంట్‌తో చేటు ఎవరికి?
 
 
ముఖ్య వార్తలు
  నేటి నుంచి న్యూఢిల్లీకి దురంతో రైలు
  శాఖమూరికి నివాళి
  బహిష్కరణపై ఆగ్రహం
  డీమ్డ్‌ ఇక ఉండవ్ఞ
  హాకీ ప్రపంచ కప్‌ విజేత ఆస్ట్రేలియా
  ఆల్‌ ఇంగ్లండ్‌ బాడ్మింటన్‌..
  కామన్వెల్త్‌ బాక్సింగ్‌ సెమీస్‌లో..
  ముంబయి ఇండియన్స్‌ విక్టరీ
  జిల్లాల్లో ఆయుర్వేదంపై ప్రచారం
  లార్స్‌కో కొత్త చిత్రం
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com