మార్చిన వార్తా విశేషాలు - మంగళ వారం మార్చి   16th 2010 - 2:11 PM RSS  

Bharatmatrimony
లాగిన్ | రిజిస్టర్
ఫాలోఆన్‌ ఆడుతున్న ధోనీసేన
మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 10:50 [IST]

sehawag badrinadhనాగ్‌పూర్‌, ఫిబ్రవరి 8 : స్వదేశంలో ఎదురులేని భారత జట్టును బెదురగొట్టిన దక్షిణాఫ్రికా బౌలర్‌ స్టెయిన్‌ ఒక్కడే మూడోరోజు తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టి ఫాలోఆన్‌లో పడేశాడు. అంతకు ముందు దక్షిణాఫ్రికాను ఆలౌట్‌ చేయడానికి రెండు రోజులు సమయం తీసుకున్న భారత్‌ బౌలర్లకు రెం డో ఇన్నింగ్స్‌లో తమకు బౌలింగ్‌ చేసే అవకాశం కూడా ఇవ్వకుండా భారత్‌కే తిరిగి బ్యాటింగ్‌ అప్ప గించారు సఫారీలు.

25పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరు తో బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌కు మూడోరోజు ఆదిలోనే గంభీర్‌ (12) రూపంలో ఎదురు దెబ్బ తగిలింది. జట్టు స్కోరు 31 పరుగుల వద్ద మోర్క ల్‌ బౌలింగ్‌లో బోచర్‌కు క్యాచ్చిన గంభీర్‌ పెవీలి యన్‌కు చేరాడు. దీంతో మరో టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌ మన్‌ మాస్టర్‌ బ్లాస్ట్‌ర్‌ సచిన్‌ టెండూల్కర్‌, మిడిలార్డర్‌లో మహేంద్రసింగ్‌ ధోనీలు జట్టును ఆదుకుంటారనుకున్నప్పటికీ దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి వారు పెవీలియన్‌ బాట పట్టారు. ఈ క్రమం లో సిరీస్‌ ప్రారంభం నుంచి ఎవరి గురించి అయితే సఫారీలు భయపడుతున్నారో అతడే వారి పట్ల కొర కరాని కొయ్యగా తయారయ్యాడు.

జట్టుజట్టంతా ఎవరిని ముందుగా ఔట్‌ చేయాలనుకున్నారో అతడే క్రీజ్‌లో మొండికేసి బ్యాటింగ్‌ చేశాడు. క్రీజ్‌లోకి వచ్చినప్పటి నుంచి బంతిని వీరబాదుడు బాదే సెహ్వాగ్‌ స్టెయిన్‌ ధాటికి కుప్పకూలుతున్న భారత్‌ను ఆదుకునేందుకు ఒకే ఒక్కడుగా బాధ్యతలు బుజాన వేసుకున్నాడు. తన సహజస్ధిమైన దూకుడును పక్క నబెట్టి ఆచీతూచీ ఆడుతూ జట్టును ఆదుకున్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా బంతిని బౌండరీకి తర లిస్తూ, ఎంతో సంయమనంతో వికెట్ల మధ్య పరు గులు తీసిన వీరూ స్కోరుబోర్డును ముందుకు నడిపాడు. మురళీ విజ§్‌ు (4), సచిన్‌ (9) వెంట వెంటనే పెవీలియన్‌కు చేరడంతో అసహనానికి గురైన సెహ్వాగ్‌ ఈ మ్యాచ్‌తో టెస్ట్‌ అరగేట్రం చేసిన తమిళనాడు బ్యాట్స్‌మన్‌ సుబ్రహ్మణ్యం బద్రినా థ్‌తో కలిసి పరుగులు రాబట్టాడు.

ఒకవైపు బ్యాట్స్‌ మెన్‌ అంతా పెవీలియన్‌కు క్యూ కడుతున్నప్పటికీ ఎంతో ఓపికతో సఫారీల బౌలింగ్‌ను ఎదుర్కొంటూ సెహ్వాగ్‌ (109; 139 బంతుల్లో 15 ఫోర్ల సాయం తో) టెస్ట్‌ల్లో తన 18వ సెంచరీని నమోదు చేసుకు న్నాడు. ఎక్కడ లేని సహనాన్ని కూడగట్టుకుని బ్యాటింగ్‌ చేసిన వీరూ భారత్‌ పరువు దక్కించాడు. మరోవైపు దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జట్టు కష్టకాలంలో ఆదుకునేందుకు వికెట్ల మధ్య సమయస్పూర్తీతో బ్యాటింగ్‌ చేసిన బద్రినాథ్‌ (56; 139 బంతుల్లో, 7 ఫోర్ల సాయంతో) అర్ధ సెంచరీతో రాణించి సెహ్వాగ్‌కు చక్కని సహకారం అందించాడు.

బద్రితో పాటు అరంగేట్రం చేసిన మ రో బెంగాల్‌ బ్యాట్స్‌మన్‌ సహ డకౌటయి సెల్టెర్లను నిరాశ పరిచాడు. ఒక క్రమంలో జట్టు స్కోరు 221 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన భారత్‌ మరో 42 బంతుల్లో కేవలం 12 పరుగులు మాత్రమే చేసి మిగతా 5 వికెట్లు కోల్పోవడం గమనార్హం. 57.4 ఓవర్ల వద్ద ధోనీ (6)ని హరీస్‌ ఔట్‌ చేసిన అనం తరం స్టెయిన్‌ రెచ్చిపోయి సహ (0), హర్భజ న్‌సింగ్‌ (8), జహీర్‌ఖాన్‌ (2), అమిత్‌మిశ్రా (0), ఇషాంత్‌శర్మా (0)లను వరుసబెట్టి పెవీలియన్‌కు చేర్చాడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. తొలి ఇన్నింగ్స్‌లో 558 పరుగులు చేసిన దక్షిణా ఫ్రికా భారత్‌ చేసిన 233 పరుగులు పోనూ మరో 335 పరుగుల ఆదిక్యంలో ఉండడతో భారత్‌ను ఫాలోఆన్‌ ఆడించింది.

మూడోరోజు రెండో ఇన్నిం గ్స్‌ ప్రారంభించిన భారత్‌ వికెట్ల పతనాన్ని  మోర్క ల్‌ మళ్లీ ప్రారంభించాడు. రెండో ఓవర్లో గంభీర్‌ (1)ని బోల్డ్‌ చేయగా మరో ఓపెనర్‌ సెహ్వాగ్‌ (16)ను స్టెయిన్‌ ఇంటిదారి పట్టించాడు. రెండో ఇన్నింగ్స్‌ లోనైనా పుంజుకుంటుందనుకేనే భారత్‌ 4.4 ఓవ ర్లలోనే 2 వికెట్లు పడిపోవడంతో భారత్‌ ఒక్క రోజులోనే 12 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం మురళీ విజ§్‌ు (27), సచిన్‌ (15) పరుగులతో క్రీజ్‌లో ఉండగా ముడోరోజు ఆట ముగి సే సమయానికి భారత్‌ 66 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా 2 వికెట్లు కోల్పోయి భా రత్‌ మళ్లీ గట్టెక్కాలంటే ఏదైనా అద్భుతమే జరగాలి మారి.

ఒక్కరోజులోనే భారత్‌ను చావుదెబ్బ తీసిన దక్షిణాఫ్రికా బౌలర్‌ స్టెయిన్‌ మొత్తం 8 వికెట్లు తన ఖాతాలో వేసుకోగా మోర్కల్‌ 2 వికెట్లు, పర్నెల్‌, హరీస్‌లు చెరొక వికెట్‌ తీసుకున్నారు.
 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను..
 జంట విజయాలతో పెరిగిన నమ్మకం సౌరవ్‌..
 మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్‌
 నేటి నుంచి మార్గోవా బాడ్మింటన్‌..
 నకిలీ ఐపిఎల్‌ టిక్కెట్లతో..
 .సచిన్‌, గంభీర్‌, సంగక్కరలకూ తప్పని..
 ముంబయి ఇండియన్స్‌ విక్టరీ
 దక్షిణాఫ్రికాను ఓడించి 9వ స్థానంలో..
 సెంటిమెంట్‌తో చేటు ఎవరికి?
 యూత్‌ ఛాంప్‌ ఫైనల్స్‌కు భారత సారథి..
 
 
ముఖ్య వార్తలు
  నేటి నుంచి న్యూఢిల్లీకి దురంతో రైలు
  శాఖమూరికి నివాళి
  బహిష్కరణపై ఆగ్రహం
  డీమ్డ్‌ ఇక ఉండవ్ఞ
  హాకీ ప్రపంచ కప్‌ విజేత ఆస్ట్రేలియా
  ఆల్‌ ఇంగ్లండ్‌ బాడ్మింటన్‌..
  కామన్వెల్త్‌ బాక్సింగ్‌ సెమీస్‌లో..
  ముంబయి ఇండియన్స్‌ విక్టరీ
  జిల్లాల్లో ఆయుర్వేదంపై ప్రచారం
  లార్స్‌కో కొత్త చిత్రం
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com