| కమలా భగవత్ కన్నుమూత |
| మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 10:40 [IST] |
 |
|
పుణె : ప్రముఖ సిపిఐ నాయకురాలు కమలా భగవత్ సోమవారం ఇక్కడ తన నివాసంలో కన్నుమూశారు. ఆమె వయస్సు 94 సంవత్సరాలు. 1934లో స్వాతంత్రోద్యమంలోకి దూకిన కమల తర్వాత సిపిఐ పూర్తిస్థాయి కార్యకర్తగా మారి,మహారాష్ట్రలో కార్మికోద్యమంలో పాల్గొనడం ద్వారా శ్రామికవర్గ సమస్యలపై పోరాడారు.
సంయుక్త మహారాష్ట్ర ఉద్యమంలో ముందుండి, గోవా విముక్తి ఉద్యమంలో పోరాడారు. పలు దశాబ్దాలుగా కమ్యూనిస్టు ఉద్యమానికి భగవత్ చేసిన సేవలకు సిపిఐ, సిపిఎం నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
|
|
|
|
|
|
|