అహ్మదాబాద్ : గుజ రాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తన పై ఇప్పటివరకు ఉన్న ధనికులకు అనుకూలుడన్న ముద్రను చెరిపివేసుకుని, పేదల పక్షపాతి గా కొత్త అవతారం ఎత్తుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 'గరీబ్ కల్యాణ్ మేళాను నిర్వహించడం ద్వా రా మోడీ పేదలకు అనుకూలుడిగా అవతరించాలనుకుంటున్నారు.అయితే ఆయన ఎత్తు గడను 'తమాషాగా ప్రతి పక్షాలు అభివర్ణించాయి.
రాష్ట్రంలో ఆయన ఇప్పటికే కనీసం 25 నుంచి 50 కల్యాణ్ మేళాలు నిర్వహించారు. దళారుల ప్రమేయం లేకుండానే పేదలకు నేరుగా ప్రయోజనాలు అందే వివిధ ప్రభుత్వ పథకాలను తాము ఇ ప్పటికే అమలు చే స్తున్నట్లు మోడీ పే ర్కొంటున్నారు.
''మోడీ ధనికుల పక్షపాతి నుంచి పేదలకు అనుకూలుడిగా అనిపించుకోవాలనుకుంటున్నారు. కానీ ఈ విషయంలో సఫలీకృతుడు కాలేరుఅని కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ దోషి అన్నారు.