చండీగఢ్/అహ్మదాబాద్, ఫిబ్రవరి 8 : రుచిక పట్ల అనుచితంగా ప్రవర్తించిన కేసులో నిందితుడైన మాజీ డిజిపి ఎస్.పి.ఎస్.రాధోడ్‌పై సోమవారం ఇక్కడ జిల్లా కోర్టు వెలుపల ఓ యువకుడు కత్తి తో దాడి చేశాడు. రాధోడ్ ముఖంపై పదేపదే పి డిగుద్దులు గుద్దాడు. రుచిక కేసులో రాధోడ్ చేసి న అప్పీల్‌పై ఇక్కడ కోర్టు విచారణ జరుపు తు న్నది. రాధోడ్ కోర్టు వెలుపలకు వస్తుండగా, ఆయనను ఫోటోలు తీస్తున్న యువకుడు హఠా త్తుగా ఆయన ఎడమ పెదవిపై పదేపదే కొట్టడం తో రక్తస్రావమైంది.
దీనితో రాధోడ్ కారు ఎక్కే ముందు గాయాన్ని చేతిరుమాలుతో కప్పిపు చ్చా రు. దాడి తర్వ్డాత కోర్టు వెలుపల గందరగో ళం నెలకొన్న నేపథ్యంలో భద్రతాసిబ్బంది యు వకు డిని పట్టుకున్నది. దాడి వెనుక ఉద్దేశాన్ని గుర్తిం చడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలి పా రు. రుచిక వేధింపుల కేసులో తనకు ఆరేళ్ల జైలు శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ రాధోడ్ పెట్టు కున్న పిటిషన్‌పై రహస్య విచారణకు అదనపు జిల్లా, సెషన్స్‌జడ్జి రాజ్‌శేఖర్ అఫ్రీ అంతకు ముందు ఆదేశించారు.
రహస్య విచారణకు రాదోడ్‌ను అనుమతించడానికి మీడియా సిబ్బంది కోర్టుకు వెళ్లిపోవాలని జడ్జి మీడియా ప్రతినిధు లను కోరారు. ప్రాధమిక చికిత్స తర్వాత రాదోడ్ తిరిగి వచ్చేంతవరకు జడ్జి వేచిఉండటంతో భో జన విరామ సమయం తర్వాత విచారణ జాప్య మైంది. బోజన విరామ సమయం తర్వాత వెం టనే కోర్టు విచారణ ప్రారంభం కాగానే, కేసులో ఫిర్యాదిదారుడైన మధుపర్కాష్ తరఫు న్యాయ వాది పంకజ్ భరద్వాజ్ నిందితుడు రాధోడ్‌పై దాడి జరిగిన సంగతిని జడ్జికి తెలియజేశారు.
రాధోడ్ భార్య అభా సహా ఆయన తరఫు న్యా యవాదులెవరూ కోర్టులో లేకపోవడంతో తదు పరి విచారణ చేపట్టడానికి రాధోడ్ కోసం తాను ఎదురుచూస్తానని జడ్జి అన్నారు. ముఖానికి బ్యాండేజితో రాధోడ్ కోర్టుకు తిరిగి రావడంతో విచారణ కొనసాగింది.