మార్చిన వార్తా విశేషాలు - భుధ వారం మార్చి   10th 2010 - 4:26 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
రాజ్యాంగ విరుద్ధం
మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 9:57 [IST]

pranteeyaహైకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు
రిజర్వేషన్లకు ఐదుగురు న్యాయమూర్తుల
వ్యతిరేకత, ఇరువురు మద్దతు
బిసి కమిషన్‌ సర్వే, గణాంక వివరాల సేకరణ,
సిఫారసులను తప్పుపట్టిన న్యాయస్థానం
హైదరాబాద్‌, ఫిబ్రవరి8, ప్రభాతవార్త ప్రధాన ప్రతి నిధి:
  విద్య, ఉద్యోగాల్లో ముస్లిం అల్పసంఖ్యాకు లకు ప్రభుత్వం కల్పించిన  4 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమనిహైకోర్టు ఏడుగురు న్యాయ మూర్తుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం ప్రక టించింది.

విద్య, సామాజిక రంగాల్లో వెనకబ డిన వర్గాల గుర్తింపునకు బిసి కమిషన్‌ నిర్వహిం చిన సర్వే, సేకరించిన గణాంక వివరాలు, సిద్దం చేసినసిఫారసులులోపభూయిష్టంగా ఉన్నాయని, సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలకు అను గుణంగా లేవని వెల్లడించింది. రిజర్వేషన్ల కల్ప నకుప్రభుత్వం2007లోరూపొందించిన చట్టాన్ని, అందుకు అనుగుణంగా 2007 జూలై 7న వెనుక బడిన వర్గాల సంక్షేమశాఖ 23వసంఖ్యతో, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ 231వ సంఖ్యతో జారీచేసిన ఉత్తర్వులను కొట్టివేసింది.

రిజర్వేష న్లనే రద్దు చేసినందున సంపన్న శ్రేణి గుర్తింపు నకు 2006 ఏప్రిల్‌ 4న బిసి సంక్షేమశాఖ జారీ చేసిన 3వ సంఖ్య ఉత్తర్వు చట్టబద్ధతపై తీర్పును ప్రకటించాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి అనిల్‌ రమేష్‌దవే, న్యాయ మూర్తులు ఎ గోపాలరెడ్డి, వి ఈశ్వరయ్య, గోడ రఘురాంలు రిజర్వేషన్ల ఉత్తర్వులను వ్యతిరేక తతో ఒకేతీర్పును ప్రకటించగా రిజర్వేషన్ల కల్పన తీరును న్యాయమూర్తిటి.మీనాకుమారి వ్యతిరేకిం చినా వేరుగా తీర్పును ప్రకటించారు.

రిజర్వేషన్ల కల్పనను న్యాయమూర్తులుబి,ప్రకాశరావు, డిఎస్‌ ఆర్‌ వర్మ సమర్థించారు. ప్రకాశరావును తీర్పును ప్రకటించగా, వ్యాజ్యాలన్నిటిని తిరస్కరించినట్టు, మెజారిటీ న్యాయమూర్తుల అభిప్రాయంతో విభే దించినట్టు వెల్లడించిన డిఎస్‌ఆర్‌ వర్మ అందుకు కారణాలతో తీర్పు సిద్దం మవుతుందని ప్రకటిం చారు. ముస్లింల్లో విద్య, సామాజికంగా వెనకబడిన 15 వర్గాలవారికి ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ల చట్టబద్ధతను  సవాలుచేస్తూ పలు సంస్థలు, వ్యక్తులు, విద్యార్థులు వేర్వేరుగా దాఖలుచేసిన వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తిసహా ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారించింది.2008 మార్చిలో వాదనలు ముగించి తీర్పును వాయిదా వేసింది.న్యాయకోవిదులు,న్యాయమూర్తులతో కిక్కిరిసిన మొదటి హాలులో 167 పేజీల తీర్పును ప్రకటించారు. ఉత్తర్వు అమలుపై 90రోజులపాటు సస్పెన్షన్‌ విధించాలనే అడ్వ కేటు జనరల్‌ అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది.

చట్టాల రాజ్యాంగబద్ధత, అధికారాల వినియోగం న్యాయవ్యవస్థ సమీక్షకు లోబడి ఉంటుందని, రాజ్యాంగం 14, 15, 16 అధికారణల కింద రాజ్య అధికారాల విని యోగ సమీక్షకు ప్రత్యేక ప్రమాణాలు, సూత్రాలు లేవని ప్రధాన న్యాయమూర్తి ఎఆర్‌ దవే, న్యాయమూర్తులు  గోపాలరెడ్డి, ఈశ్వరయ్య, రఘురాంలు వెల్లడిం చారు. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాల గుర్తింపు  వ్యతిరేక, దామాష వాదనలకు సమాధానంలా ఉండాలని, అమెరికా న్యాయస్థానాల కఠిన పరిశీలన, ప్రమాణాల విధానం భారత్‌కు వర్తించవని రాజ్య చర్యకు జాగ్రత్తతో కూడిన లోతైన పరిశీలనతోనే చట్టబద్ధత సాధ్యమని, బి అర్చనారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వల మధ్య వివాదంలో అనుసరించిన పరిశీలన సుభాష్‌ చౌదరీ, భారత ప్రభుత్వం అశోక్‌ కుమార్‌ థాకూర్‌ల వివాదంలో సుప్రీంకోర్టు రూపొం దించిన చట్ట నిబంధనలకు తోసి రాదని అభిప్రాయపడింది. రిజర్వేషన్ల కల్పనకు 2007 జూలైన 2న బిసి కమిషన్‌ చేసిన సిఫారసులు చెల్లనేరవని  ప్రకటించింది.

వెనకబడిన వర్గాల విద్య, సామాజిక పరిస్థితుల విశ్లేషణ, ముస్లింల్లో ఆర్థిక, సామాజిక రంగాల్లో వెనకబడిన వర్గాల గుర్తింపులో బిసి కమిషన్‌ విఫలమైందని అభిప్రాయపడింది. ఇ గ్రూపులో చేర్చే పలువర్గాల జనాభా గణాంక వివరాలసేకరణలో, సర్వే నిర్వహణ, అందుకు స్థలాల ఎంపికలో శాస్త్రీయ విధానం అనుసరణలో కమిషన్‌ విఫలమైందని వెల్లడించింది. నివేదిక, సిఫారసుల తయారీకి అనుసరించిన అధ్యయన విధానాలు, నిర్వ హించిన సర్వే నమూనాలకు శాస్త్రీయత కొరవడిందని, క్రమపద్ధతిని, ప్రమాణాలను పాటించ లేదని ప్రకటించింది. పీపుల్‌ఆఫ్‌ ఇండియా ఎఎన్‌ఎస్‌ఐ సర్వీసు సేకరించిన గణాంక వివరాలు, వెలిబుచ్చిన అభిప్రాయాలకు రాజ్యాంగం 15(4), 16(4) అధికరణల కింద కల్పించిన రిజర్వేషన్ల చట్టబద్ధత పరిశీలనకు పొంతనలేదని తప్పుపట్టింది.

పరి శోధన కోసం ఐఎఎస్‌ అధికారి పిఎస్‌ కృష్ణన్‌ సేకరించిన గణాంక వివరాలు, రూపొంచిన నివేదికల వినియోగమే బిసి కమిషన్‌ చిత్తశుద్ధిని స్పష్టంచేసిందని వ్యాఖ్యానించింది. ీ'ముస్లింల్లో సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గాలవారి గుర్తింపు, బిసి ఇ గ్రూపులో చేర్పు చెల్లదని, 2007వ సంవత్సర చట్టం రాజ్యాం గం 14, 15(1), 16(2) అధికరణల అతిక్రమణయని నలుగురు తీర్పులో స్పష్టం చేసింది. వ్యాజ్యాలను అనుమ తించింది. విద్య, సామాజిక రంగాల్లో వెనకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించేందుకు, చట్టాలు రూపొందించేందుకు ప్రభుత్వానికి అది µకారం ఉందని, చట్టబద్ధ కమిషన్‌ చేసిన పరిశీలన చాలినంతగా లేదని, వాస్తవాలు, సమగ్ర అధ్యయనాల ఆధారంగా నివేదికను రూపొందించలేదని న్యాయమూర్తి టి మీనాకుమారి వెల్లడించారు. కమిషన్‌ సర్వే ఆరు జిల్లాలకు, మూడు రోజులకే పరిమితమైందని తప్పుపట్టింది. సొంత జ్ఞానాన్ని వినియో గించకుండా, యాంత్రికంగా నివేదికను రూపొందించారని, వాక్యాల రూపకల్పనలోనూ పిఎస్‌ కృష్ణన్‌ నివేదికనే అనుసరించిందని స్పష్టంచేసింది.

రిజర్వేషన్లకు ఇరువురు న్యాయమూర్తుల మద్దతు
విద్య, సామాజిక రంగాల్లో వెనకబడిన వర్గాల గుర్తింపునకు బిసి కమిషన్‌ సర్వే, అధ్యయనాలు చేసినందున రిజర్వేషన్లు చట్టబద్ధమని న్యాయమూర్తి బి ప్రకాశరావు వేరుగా వెలువరించిన తీర్పులో ప్రకటించారు. చట్టబద్ద సంస్థ నిర్వహించిన ప్రక్రియలో లోపాలున్నంతమాత్రాన రిజర్వేషన్‌ చట్టాన్ని సస్పెండ్‌ చేయరాదని అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లచట్టాన్ని సవాలుచేస్తూ దాఖలైన వ్యాజ్యాలన్నిటిని తిరస్కరించినట్లు ప్రకటిం చిన న్యాయమూర్తి డిఎస్‌ఆర్‌ వర్మ తీర్పును ప్రకటించలేదు. మెజారిటీ న్యాయమూర్తుల అభిప్రాయాలను వ్యతిరేకించినట్టు వెల్లడించిన ఆయన అందుకు కారణాలతో తీర్పు సిద్ద మవుతుందని ప్రకటించారు. 
 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 చల్లని కబురు
 లేచింది మహిళా లోకం దద్దరిల్లింది..
 ముగ్గురు రైతుల ఆత్మహత్యలు
 పర్యటన జయప్రదం
 వద్దన్నవారూ వస్తారు
 థర్డ్‌ జనరేషన్‌ (3జి) ప్రారంభించిన..
 పర్యావరణ మార్పులతో పంట నష్టం :..
 కరెంటు కోత
 పెట్రో మంటపై టిడిపి, లెఫ్ట్‌..
 కల్కి భగవాన్‌కు కష్టాలు
 
 
ముఖ్య వార్తలు
  అంతరిక్ష విజ్ఞానంలోనూ సగం
  రెండు రాష్ట్రాలుగా తెలంగాణ, సీమాంధ్ర
  లారీ, ఆటో ఢీకొని 12మంది మృతి
  భారత పాస్‌పోర్టు అప్పగించిన ..
  సంఘీ రథయాత్రకు అపూర్వ స్పందన
  ఇంటి ముఖం పట్టిన మైఖెల్‌ క్లార్కె
  పెరిగిన కార్ల అమ్మకాలు
  ఎస్‌బిఐ చట్టం సవరణకు బిల్లు
  82వ ఆస్కార్‌ అవార్డులు
  ముమైత్‌ఖాన్‌ ఎల్‌ బోర్డ్‌
రాజకీయ జేఏసీ నుంచి వైదొలగుతూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా...?
అవును
కాదు
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com