జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు

ఏపీలో జనసేన పార్టీ కి మరో అండ దొరికింది. చీరాల మాజీ ఎమ్మెల్యే, వైస్సార్సీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు జనసేన పార్టీలో చేరబోతున్నారు. జూన్ 12న పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోబోతున్నారు. 14వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టనున్నారు. ఈ వారాహి యాత్రకు ముందే అంటే 12న మంగళగిరి లోని పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ నిర్వహించే పూజా సమయంలోనే జనసేన పార్టీలో చేరాలని ఆమంచి స్వాములు నిర్ణయించుకున్నారు.

జనసేన నుండి తనకు సీటు ఇచ్చిన ఇవ్వకపోయినా పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని పవన్ కల్యాణ్ విధానాలు నచ్చి..ఆయన ఆలోచనలు నచ్చి పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. జనసేన పార్టీ బలోపేతం కోసమే తాను పనిచేయాలని పదవుల కోసం కాదని తెలిపారు. కానీ పార్టీ టికెట్ ఇస్తే పోటీలో ఉంటానని..టికెట్ ఇవ్వకపోయినా పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని తెలిపారు.చీరాల పర్చూరు రాజకీయాలలో తన సోదరుడు మాజీ ఎమ్మెల్యే..ప్రస్తుత వైసీపీ నేత ఆమంచి కృష్ణ మోహన్ ఉన్నందున ఇక్కడ నుండి పోటీచేసే బదులు గిద్దలూరు నుండి అవకాశం కల్పిస్తే పోటీ చేయాలనే ఆలోచనలో ఆమంచి స్వాములు ఉన్నారు.