హోమ్  >>  తెర-సినిమా ప్రత్యేకం  >>  అలరించే యాక్షన్‌తో 'ఇద్దరమ్మాయిలతో..'
గురువారం , మార్చి 21 ,2013


NewsListandDetails

అల్లు అర్జున్‌,  పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'ఇద్దరమ్మాయిలతో..' సినిమా సినీ వర్గాల్లోనే కాకుండా బిజినెస్‌ వర్గాల్లోనూ ఆసక్తి రేకెత్తి స్తోంది. 'దేశముదురు' వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత  ఆ కాంబినేషన్‌తో వస్తున్న సినిమా కావడం ఓ కారణమైతే, ఇటీవల విడుదల చేసిన సినిమా ఫస్ట్‌లుక్‌కి వస్తున్న రెస్పాన్స్‌ కూడా మరో  కారణం. టైటిల్‌ సాఫ్ట్‌గా ఉన్నా సినిమాలో యాక్షన్‌ కూడా తగిన  మోతాదులోనే  ఉంటుందని  కత్తులు పట్టుకున్న బన్నీ స్టిల్స్‌  చెబుతున్నాయి. బన్నీ సరసన నటిస్తున్న నేటి  సంచలన తారలు అమలాపాల్‌, కేథిరిన్‌ ప్రేక్షకుల్ని గ్లామర్‌తో అలరిస్తారని యూనిట్‌ సభ్యులు చెబుతున్న మాట. 'జులాయి' సక్సెస్‌తో జోరు మీదున్న బన్నీతో  మాంచి కసితో  సినిమా  రూపొందిస్తున్నాడు పూరి. అందుకే 'ఇద్దరమ్మాయిలతో..' సినిమాని సెన్సే షనల్‌గా  అతను తీస్తున్నాడని చెప్పుకుంటున్నారు.  మే 10న రాబోతున్న ఈ సినిమా బన్నీ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్టయిన 'జులాయి'ని దాటడం ఖాయమని  నిర్మాత బండ్లగణేష్‌ ఎంతో నమ్మకంగా చెబుతున్నారు.


Related News


>>More

ఫొటొ గ్యాలరీ
>> More
District News  :భవిష్యవాణి

రాశి సెలెక్ట్ చేసి ఆప్షన్ క్లిక్ చేయండి
పంచాంగము
 
 దినము వారాలు  
మాసాలు   సంవత్సరం  
matrimony