తెలంగాణ జర్నలిస్టులను ఆహ్వానించిన నవ్యాంధ్రప్రదేశ్‌ జర్నలిస్టులు

welcome
సైఫాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ (ఎపిడబ్ల్యూజెఎఫ్‌) 4వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 28,29 తేదీలలో తిరుపతిలో జరుగుతున్న నేపధ్యంలో ఫెడరేషన్‌, నేషనల్‌ అలయన్స్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌(ఎన్‌ఎజె) నాయకులు తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ (టియుడబ్ల్యూజెఎఫ్‌)ను ఆహ్వానించింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌ నగరంలో ఎపిడబ్ల్యూజెఎఫ్‌, ఎన్‌ఎజె నాయకులు ఆకుల అమరయ్య, ఎన్‌.కోండయ్య తదితరులు టియుడబ్ల్యూజెఎఫ్‌ అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఉపాధ్యక్షుడు పులిపలుపుల ఆనందంను తమ మహాసభలకు హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా రెండు ఫెడరేషన్‌ల నాయకులు ఉభయ తెలుగు రాష్ట్రాల ఫెడరేషన్‌ కార్యకలాపాలు, పరిస్ధితులు, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, ప్రదానంగా రెండు రాష్ట్రాలలో జర్నలిస్టుల ఇళ్ళ స్ధలాల సమస్య, జాతీఈయ వ్యవహారాలు తదితర అంశాలపై గంటసేపు చర్చించడం జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని జర్నలిస్టుల సమస్యలపై త్వరలో హైదరాబాద్‌ నగరంలో జాతీయ స్ధాయి సమావేశాన్ని నిర్వహింస్తామని వారు తెలిపారు.