ఉపాధి కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు

jobs
jobs

హైదరాబాద్‌: జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ యువత 2018-2019లో సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ సంస్థ ఆధ్వర్యంలో పలు కోర్సుల్లో శిక్షణ పొందేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఎస్సీ జిల్లా సర్వీస్‌ కో ఆపరేటివ్‌ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మొబైల్‌ ఫోన్‌, ఎల్‌ఈడీ, హోం థియేటర్‌ టీవీ, ఎయిర్‌ కండీషనర్‌, కంప్యూటర్‌ ఎయిడెడ్‌ టూల్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్‌ సర్టిఫికెట్‌ కోర్సులో శిక్షణ ఇస్తామని వారు పేర్కొన్నారు. ఒక్కో కోర్సులో మూడు నుంచి ఆరు నెలల పాటు శిక్షణ ఉంటుందని, విద్యార్హతలను బట్టి వారికి ఆయా కోర్సుల్లో శిక్షణ ఇస్తామని తెలిపారు. శిక్షణ పొందేందుకు 18 నుంచి 35 ఏళ్ల లోపు వారు ఆధార్‌, ఆదాయ, స్టడీ జీరాక్స్‌ ప్రతులతో ఈ నెల 25లోపు దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు.